Salaar Radha Rama Behind Story: సలార్‌ ‘రాధా రమా’కు క్రికెట్‌తో లింకేమిటి?

24 Dec, 2023 09:42 IST|Sakshi

ప్రభాస్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా సలార్‌లో రాధా రమగా నటి శ్రేయా రెడ్డి దుమ్మురేపింది.  ఖాన్సార్‌ను ఆమె ఒకే రేంజ్‌లో వణికించేసింది. ఆ సినిమాలో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ తర్వాత శ్రేయా రెడ్డినే ఎక్కువ డామినేట్‌ చేసింది. ఇందులో జగపతిబాబు కూతురిగా పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించింది. ఆమె గతం గురించి తెలియని వాళ్లు అందరూ ఎవరబ్బా ఈ బ్యూటీ అని తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి తెలిసిన వాళ్లు డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్లతో షేర్‌ చేస్తున్నారు.

ఇంతకు ఈ డెవిల్‌... అదేనండి 'రాధా రమ' కాదు కాదు మన శ్రేయా రెడ్డి ఎవరో తెలుసుకుందాం. 2003లో అప్పుడప్పుడు అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శర్వానంద్‌ అమ్మ చెప్పింది సినిమాలో కనిపించి కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగులో రెండు సినిమాలే చేసినా 2006లో వచ్చినా విశాల్‌ 'పొగరు' సినిమాలో ఈశ్వరిగా ఒక రేంజ్‌ల్‌ తన ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంది. ఈ ఒక్క సినిమా ఆమె పేరు ఇప్పటికీ గుర్తుండేలా చేసింది. ఆ తర్వాత హీరో విశాల్ అన్నయ్య విక్రమ్‌ను పెళ్లి చేసుకుని గృహిణిగా ఉంటూ నటనకు దూరం అయ్యారు.

కొంత కాలం అమెరికాలో ఉన్న శ్రేయా రెడ్డి ఆ తర్వాత చెన్నైకి తిరిగొచ్చారు. గతేడాది సుడల్ (Suzhal) అనే వెబ్ సిరీస్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చిన ఈ క్రైమ్‌ వెబ్‌సీరిస్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. అలా ఆమె రీ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. సలార్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ OG చిత్రంలో ఆమెకు ఛాన్స్‌ దక్కింది. సలార్‌ దెబ్బతో శ్రేయా పాన్ ఇండియా రేంజ్‌లో  గుర్తింపు తెచ్చుకుంది. ముందు ముందు శ్రేయాను ఆపడం ఎవరి తరం కాదని చెప్పవచ్చు.

శ్రేయా రెడ్డి భర్త ఏం చేస్తారు
కోలీవుడ్‌లో వీజేగా విక్రమ్‌ కెరియర్‌ స్టార్ట్‌ చేశాడు. కెరియర్‌ ప్రారంభంలో శ్రేయా రెడ్డి కూడా వీజేగా పనిచేయంతో వారిద్దరికి అక్కడ పరిచయం ఏర్పడటం ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. విశాల్‌ కంటే ముందే విక్రమ్‌ కోలీవుడ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా తక్కువ సినిమాల్లో కనిపించినా  ఆ తర్వాత  GK ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ ఏర్పాటు చేసి నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. ఇందులో ఎక్కువగా విశాల్‌తోనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఆయన పలు సినిమాలకు పంపణీ దారుడిగా ఇండస్ట్రీలో ఉన్నారని సమాచారం.

శ్రేయా రెడ్డి తండ్రి క్రికెటర్ అని తెలుసా..
శ్రేయా రెడ్డి తండ్రి భరత్‌ రెడ్డి చెన్నైలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా జట్టు తరుపున పలు మ్యాచ్‌ల్లో రానించారు.  అతను 1978, 1981 మధ్య పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై మూడు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లలో వికెట్-కీపర్‌గా కొనసాగారు. అతను 1982-83 నుంచి 1985-86 వరకు తమిళనాడుకు కెప్టెన్‌గా కూడా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, రెడ్డి కెంప్లాస్ట్‌లో పనిచేశారు. అతను చెన్నైలో క్రికెట్ శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో తోడ్పడ్డారు. అక్కడ అతను భారత టెస్ట్ ఆటగాళ్లు దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీలకు శిక్షణ ఇచ్చారు.

Sriya Reddy: ట్రెండింగ్‌లో సలార్‌ బ్యూటీ.. రాధారమగా రచ్చలేపిందిగా! (ఫోటోలు)

A post shared by Sriya Reddy (@sriya_reddy)

>
మరిన్ని వార్తలు