సంక్రాంతికే సలాం కొట్టిన రజనీకాంత్‌

2 Oct, 2023 04:25 IST|Sakshi

సంక్రాంతికి ‘లాల్‌ సలాం’ అంటున్నారు రజనీకాంత్‌. విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా రజనీకాంత్, కపిల్‌ దేవ్, జీవితా రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్‌ సలాం’. ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ నిర్మించారు.

ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ‘‘లాల్‌ సలాం’ చిత్రంలో ముంబై డాన్‌  మొయిద్దీన్‌  భాయ్‌ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌  వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌.

మరిన్ని వార్తలు