250 కిలోల అభిమానం

5 Nov, 2023 00:29 IST|Sakshi

వైరల్‌

అభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్‌లకు గుడి కట్టడం కొత్త కాదు. అయితే ఆ గుడి బయట ఎక్కడో ఉంటుంది. తమిళనాడులోని మదురైకి  చెందిన కార్తీక్‌... రజనీకాంత్‌కు వీరాభిమాని.

తన ఇంటిలోని ఒక పోర్షన్‌ను రజనీ గుడిగా మలిచాడు. ఇందులో 250 కిలోల బరువు ఉన్న రజనీ విగ్రహం ఉంది. రోజూ ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. ‘రజనీకాంత్‌ను దేవుడి స్థాయిలో ఆరాధిస్తున్నాను’ అంటున్నాడు కార్తీక్‌.

మరిన్ని వార్తలు