Lal SalaamTwitter Review: 'లాల్‌ సలాం' ట్విటర్‌ రివ్యూ

9 Feb, 2024 08:25 IST|Sakshi

మొయిద్దీన్‌ భాయ్‌గా థియేటర్‌లో అడుగుపెట్టేశారు రజనీకాంత్‌. ఆయన కీలక పాత్ర పోషించిన 'లాల్‌ సలాం' నేడు ఫిబ్రవరి 9న విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో తన కుమార్తె ఐశ్వర్య  దర్శకత్వం వహించింది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలో సుభాస్కరణ్‌ ఈ మూవీని నిర్మించారు. విష్ణు విశాల్‌ , విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ మూవీలో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అతిథిగా మెప్పించారు.  ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై కనిపించారు. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు తమిళనాడులోని అన్ని ప్రదేశాల్లో ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో. మానవత్వాన్ని అందరితో పంచుకో. భారతీయుడిగా నేర్చుకోవల్సింది ఇదే అని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మత సామరస్యం ప్రధాన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది అని చాలా జాగ్రత్తగా ఈ కథన ఐశ్వర్య డైరెక్ట్‌ చేశారని నెటిజన్లు తెలుపుతున్నారు. లాల్‌ సలాం ఇచ్చిన సామాజిక సందేశం అందరినీ మెప్పిస్తుందని తెలుపుతున్నారు. ముఖ్యంగా రజనీకాంత్‌ ఎంట్రీ సీన్‌ మామూలగా ఉండదని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. ఆ సమయంలో అందరికీ భాషా సినిమా గుర్తుకొస్తుందని తెలుపుతున్నారు.

లాల్‌ సలాం చిత్రంలో రజనీకాంత్‌ ప్రత్యేక పాత్రలో కనిపించినా కథలో పూర్తిగా ఆయనే ఆక్రమించేశాడని చెప్పవచ్చు. ఇందులో  ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అదరగొట్టేశాడని అంటున్నారు. ఆయన అందించిన బీజీఎమ్‌తో రజనీకాంత్‌ ఎలివేషన్‌ సీన్స్‌ పీక్స్‌కు చేరుకుంటాయని తెలుపుతున్నారు.

లాల్‌ సలాం కథ అనేది పవర్‌ఫుల్ సబ్జెక్ట్ కానీ దానిని చెప్పడంలో కొంత వరకు ఐశ్వర్య విఫలం అయ్యారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. రజనీకాంత్‌ను చాలా తక్కువ సమయంలో చూపించారని అంటున్నారు. విష్ణు - విక్రాంత్‌ల సీన్లు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయని అంటున్నారు. సినిమాలో పెద్దగా ఎమోషనల్ కనెక్షన్ లేదని తెలుపుతూ ఫైనల్‌గా సాధారణ ఆడియెన్స్‌కు నిరాశ కలిగిస్తుందని చెబుతున్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega