HIT OTT: ఓటీటీలో రాజ్‌కుమార్‌ రావు హిట్‌, స్ట్రీమింగ్‌ అయ్యేది అప్పుడే!

24 Aug, 2022 14:39 IST|Sakshi

తెలుగులో వచ్చిన హిట్‌ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విశ్వక్‌ సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీని నేచురల్‌ స్టార్‌ నాని నిర్మించారు. ఇక్కడ మూవీ హిట్‌ కొట్టడంతో హిందీలో రీమేక్‌ అయిన విషయం తెలిసిందే కదా! రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో శైలేష్‌ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో దంగల్‌ బ్యూటీ సాన్యా మల్హోత్రా కథానాయికగా నటించింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరి హిట్‌ను యధాతథంగా తీశారా? ఏమైనా మార్పులు చేశారా? హిందీ వర్షన్‌ ఎలాగుంది? అనేది తెలుసుకోవాలంటే మరో నాలుగురోజుల్లో  నెట్‌ఫ్లిక్స్‌లో హిట్‌ను చూసేయండి మరి!

చదవండి: అలాంటి బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటున్న నటి సురేఖ వాణి
సౌందర్యతో ఎఫైర్‌.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు

>
మరిన్ని వార్తలు