Ram Charan: రామ్‌ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

2 Nov, 2023 11:23 IST|Sakshi

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది.  ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌ కమిటీ) తాజాగా వెల్లడించిన మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో రామ్‌ చరణ్‌కు చోటు దక్కింది. 'వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. అంకితభావంతో బాగా హావభావాలను ప్రదర్శించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. మెగా ఫోటో షేర్‌ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే)

ఇక 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న సంగతి తెలిసిందే.  తాజాగా విడుదలైన ఈ లిస్ట్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే జూ. ఎన్టీఆర్‌కు అందులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.  టాలీవుడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో హీరో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌కు  ఈ అరుదైన గౌరవం దక్కడంతో వారి అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

రామ్ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్లో 'గేమ్‌ ఛేంజర్‌' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీని షూటింగ్‌ హైదరాబాద్‌ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రంలోని తొలిపాటను విడుదల చేయనున్నన్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో  హీరోయిన్‌గా కియారా అడ్వాణీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2024లో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు