ఆర్ఆర్ఆర్ ప్రభంజనంతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా వారికి జేజేలు పలుకుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్కు ముందు రామ్‌చరణ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నాడట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించాడు. 'రాజమౌళి నా గురువు. ఆయన్ను కలిసి ప్రతిసారి ఎంతో విజ్ఞానాన్ని అందించారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు అవుతుండటంతో సినిమాలకు కొంత విరామం ఇద్దామనుకున్నా.
కొత్తగా ఏదైనా నేర్చుకుని తిరిగి సెట్లోకి అడుగుపెట్టాలని గతంలో అనుకున్నాను. ఆ సమయంలో రాజమౌళి నుంచి ఆర్ఆర్ఆర్ ఆఫర్ రావడంతో ఆ ఆలోచనలను విరమించుకున్నాను' అని తెలిపాడు. కాగా జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే! ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించాడు.