RGV: హైదరాబాద్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసుపై వర్మ సంచలన వ్యాఖ్యలు

6 Apr, 2022 11:37 IST|Sakshi

RGV Sensational Comments On  Drugs Case: రాష్ట్రంలో సంచలనం రేపిన బంజారాహిల్స్ ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసుపై వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుతో పోలిస్తే హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసు చాలా చిన్నదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆయన తాజా చిత్రం డేంజరస్‌ మూవీ ప్రమోషన్ల భాగంగా ఆర్జీవీ ఈ డ్రగ్స్‌ కేసుపై స్పందించారు. 

చదవండి: రామ్‌ గోపాల్‌ వర్మకు చేదు అనుభవం, స్పందించిన ఆర్జీవీ

ఈ మేరకు వర్మ మాట్లాడుతూ..  ‘ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్‌ వాడకం కామన్‌గా మారింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుతో పోలిస్తే ఇది చాలా చిన్నది. మిగతా వాటితో పోలిస్తే ఇది ఒక షాట్‌ ఫలిం అంతే అనుకుంటున్నా. ముంబైలో నా అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ టీ తాగినంత ఈజీగా డ్రగ్స్‌ తీసుకునేవారు. ఇది చాలా సర్వసాధారణ విషయం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే తాను డ్రగ్స్‌ వాడనని చెప్పిన ఆర్జీవీ ఓసారి ట్రై చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ముట్టుకోలేదని స్పష్టం చేశారు. 

చదవండి: రామ్‌ చరణ్‌కి జోడిగా అంజలి!, ఏ సినిమాలో అంటే..

అయితే తాను డ్రగ్స్‌ తీసుకోలేదు కానీ అంతకంటే ప్రమాదకరమైనవి చేస్తానంటూ తనదైన శైలిలో చెప్పారు. ఇక ఎక్కువగా ఆల్కహాల్‌ తీసుకోవడం డ్రగ్స్‌ కన్నా ప్రమాదకరమని ఆర్జీవీ పేర్కొన్నారు. కాగా ఏప్రిల్‌ 2 రాత్రి పోలీసులు బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై దాడి జరపగా ఈ డ్రగ్స్‌ వ్యవహరం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి.

మరిన్ని వార్తలు