Ram Gopal Varma: ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఎవరికీ తెలియదు: ఆర్జీవీ కామెంట్స్!

10 Dec, 2023 14:55 IST|Sakshi

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్‌ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించగా.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించారు.  ఈ మూవీ సక్సెస్ కావడంతో డైరెక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన యానిమల్ వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఆర్జీవీ సైతం సందీప్‌ను కొనియాడారు. యానిమల్ చిత్రంతో సరికొత్త ట్రెండ్‌ సెట్ చేశారంటూ ప్రశంసించారు.

అయితే మరోసారి ఆర్జీవీ యానిమల్‌ చిత్రంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. సినీ ప్రేక్షకులు, ప్రజలు, సినీ విమర్శకులను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం. యానిమల్ చిత్రం నుంచి గ్రహించాల్సిన ఐదు ప్రధాన విషయాలివే అంటూ వరుస ట్వీట్లు చేశారు. 

సినీ ప్రేక్షకుల కోసం.. 

1. ఈ రోజు నుంచి ఇంతకు ముందు అనుకున్న విధంగా భారతీయ చలనచిత్రాలు ఒకేలా ఉండవు.

2. సినిమాలో ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఎవరికీ తెలియదు.

3. మంచి, చెడు, నైతికత, విశ్వసనీయత, ఇతర కుటుంబ, సామాజిక విలువలను యానిమల్ అనే ఫిల్ స్కూల్‌లో నేర్చుకోవాలి.

4. అన్ని ఫిల్మ్ స్కూల్స్ సిలబస్‌లను తక్షణమే రద్దు చేయాలి.  భవిష్యత్ విద్యార్థులందరికీ  యానిమల్‌లా సినిమా చేయడం ఎలా? అనేది నేర్పించాలి.   ఎవరైనా సినిమా చెత్తగా ఉందని చెప్పినా సినీ నిర్మాతలందరూ ఎవరి మాట వినకూడదు.  మీలోని యానిమల్‌(టాలెంట్‌)ను బయటకు తీసుకురావాలి.

5. యానిమల్ చూశాక ప్రేక్షకులు ఇకపై చిన్నపిల్లల చిత్రాలను చూడరని ఫిల్మ్ మేకర్స్  గ్రహించాలి. 

సినీ విమర్శల కోసం.. 

1. భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన సినిమాకు అత్యంత అధ్వాన్నంగా రివ్యూలు ఇవ్వడం.. సినీ విమర్శకులకు, సినిమా బాక్సాఫీస్‌కు తేడా లేదని రుజువైంది.

2. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారో నిజంగా సినీ క్రిటిక్స్‌కు తెలియదు

3. అత్యధిక ప్రేక్షకులు వీక్షించడంతో మొదటిసారి ఫిల్మ్ మేకర్ కంటే విమర్శకులు అప్‌సెట్ అయ్యారు.

4. విమర్శకులు తమ ప్రమాణాలను మెరుగు పరచుకోవడానికి  పదే పదే యానిమల్ చూడాల్సిందే. 

5. ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్సులు నిర్వహించాలని సినీ విమర్శకులందరూ చేతులెత్తి సందీప్‌ను అభ్యర్థించాలి

 భారత ప్రజల కోసం.. 

1. భారతీయులంత ఓకేలా ఉండరు. మరీ మునుపటి భారతీయులు ఏమనుకుంటున్నారో?

2. సినిమాలు ఒక కళారూపమని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని విశ్వసిస్తే..  అంతకుముందు కళగా పిలవబడే దాన్నే యానిమల్ చిత్రం నాశనం చేసింది.

3. మనలో ఎలాంటి జంతువులు దాగి ఉన్నాయో ఇప్పుడు ప్రతి ఇండియన్‌కు మరొకరిలో కనిపిస్తోంది.

4. ఇప్పుడు ఇండియన్స్ దర్శకుడిని గౌరవిస్తారని మెగా బాక్సాఫీస్ నిరూపించింది.

5.  ప్రస్తుతం భారతీయులందరూ ఎదిగారని అందరూ గ్రహించారు. 

అంతే కాకుండా ఇప్పటి నుంచి ఇండియన్ సినిమాను రెండు భాగాలుగా(ఎరా) విభజించాలని ట్వీట్‌లో ప్రస్తావించారు. డిసెంబర్‌ 1, 2023 కంటే ముందు.. డిసెంబర్‌ 1 తర్వాత అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

>
మరిన్ని వార్తలు