మూడు సినిమాలు.. మూడు వేల కోట్ల అంచనాలు!

10 Dec, 2023 12:49 IST|Sakshi

ఒకప్పుడు సినిమా కలెక్షన్స్‌ రూ.100 కోట్లు దాటితే అదొక రికార్డు. కానీ ఇప్పుడు సాధారణ సినిమాలకు సైతం ఈజీగా రూ. 100 కోట్లు వచ్చేస్తున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలకు అయితే ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా.. మూడు, నాలుగు రోజుల్లో రూ. 100 కోట్లు రాబడుతున్నాయి. ఇక హిట్‌ టాక్‌ వస్తే మాత్రం కలెక్షన్స్‌ ఊహించలేం. ఈ ఏడాది ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు రూ.500 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టాయి. పఠాన్‌, జవాన్‌ సినిమాలు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించాయి. ఇక ఇయర్‌ ఎండ్‌లో కూడా మరో మూడు సినిమాలు రూ. 1000 కోట్ల వసూళ్లపై కన్నేశాయి. అవేంటో చదివేయండి

సలార్‌పై భారీ అంచనాలు
ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కిన సలార్‌ మూవీ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చివరి సినిమా కేజీయఫ్‌ 2 రూ. 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రభాస్‌ గత సినిమా  ఆదిపురుష్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయినా రూ. 400 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. ఒకవేళ్ల హిట్‌ అయితే మాత్రం ప్రభాస్‌ సినిమాకు రూ. 1000 కోట్ల కలెక్షన్స్‌ ఓ లెక్కనే కాదు. అందుకే సలార్‌ ఈజీగా రూ. 1000 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని అంతా భావిస్తున్నారు. 

హ్యాట్రిక్‌ హిట్‌పై షారుఖ్‌ గురి
ఈ ఏడాది కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ఖాన్‌కి బాగా కలిసొచ్చింది. ఆయన నటించిన రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజై సూపర్‌ హిట్లు కొట్టాయి. జనవరిలో వచ్చిన పఠాన్‌ మూవీ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. అలాగే సెప్టెంబర్‌లో విడుదలైన జవాన్‌ మూవీ కూడా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ఇప్పుడు ‘డంకీ’ కూడా హిట్టయితే.. షారుఖ్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్టే. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 21న విడుదల అవుతోంది. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంపై ఉన్న నమ్మకం, షారుఖ్‌ ఫామ్‌ చూస్తే.. డంకీ ఈజీగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టేలా ఉంది. ఇదే కనుగా నిజమైతే ఒకే ఏడాదిలో మూడు సినిమాలు.. రూ. 1000 కోట్లు కలెక్షన్స్‌తో షారుఖ్‌ చరిత్ర సృష్టించనట్లే అవుతుంది. 

ఇండియన్‌ స్క్రీన్‌పై సరికొత్త రికార్డు!
ఇక ఇప్పటికే డిసెంబర్‌ 1న విడుదలైన ‘యానిమల్‌’ మూవీ  ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు  స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతుంది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘అర్జున్‌ రెడ్డి’ఫేమ్‌ సందీప్‌ వంగ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి తొలిరోజు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. కలెక్షన్స్‌ మాత్రం భారీగా వస్తున్నాయి. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. డిసెంబర్‌ 22 వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో.. యానిమల్‌కి రూ. 1000 కలెక్షన్స్‌  ఈజీగా రాబడుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ యానిమల్‌తో పాటు సలార్‌, డంకీ చిత్రాలు కూడా రూ. 1000 కోట్లు వసూలు చేస్తే... ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద సరికొత్త రికార్డు క్రియేట్‌ అవుతుంది. ఒకే నెలలో రిలీజ్‌ అవుతున్న ఈ మూడు సినిమాలు మరి రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతాయో లేదే మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. 

>
మరిన్ని వార్తలు