Rashmika Mandanna:అభిమానికి వీడియో కాల్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసిన రష్మిక!

10 Dec, 2023 14:14 IST|Sakshi

పుష్ప సినిమాతో రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌గా మారింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అందుకే రష్మికకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారిలో ప్రమోద్‌ భాస్కర్‌ కూడా ఒకరు. రష్మికకు అతను వీరాభిమాని. సోషల్‌ మీడియాలో ఆమెను ఫాలో అవుతుంటాడు. అమె సినిమాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటాడు.

అంతేకాదు ఎక్స్‌(ట్విటర్‌)వేదికగా రష్మికకు ప్రపోజ్‌ కూడా చేశాడు. రష్మిక కూడా ప్రమోద్‌ ట్వీట్స్‌కి ఫన్నీ రిప్లైలు ఇచ్చింది. తాజాగా అతనితో వీడియో కాల్‌ మాట్లాడి సర్‌ప్రైజ్‌ చేసింది. ఇదంతా బిగ్‌బీ అమితాబ్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న‘ కౌన్ బనేగా క్రోర్‌పతి’షో వేదికగా జరిగింది. 

బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి రియాల్టీ షోలో తాజాగా ప్రమోద్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని కోరికను అమితాబ్‌తో పంచుకున్నాడు. రష్మిక అంటే చాలా ఇష్టమని, తన సినిమాలన్నీ చూశానని.. ఆమెకు ప్రపోజ్‌ కూడా చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్‌బీ రష్మికకు వీడియో కాల్‌ చేసి..ప్రమోద్‌తో మాట్లాడించాడు. తన ఫేవరేట్ హీరోయిన్ వీడియో కాల్ లో మాట్లాడేసరికి ప్రమోద్ సర్ ప్రైజ్ అయ్యారు.

ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నాని, పర్సనల్ గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్ అడగగా..రష్మిక తప్పకుండా మీట్ అవుదామని చెప్పింది. తన అభిమాని కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో పాల్గొనడం పట్ల రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అమితాబ్‌ రష్మికపై ప్రశంసల జల్లు కురిపించాడు. రష్మిక నటించిన ప్రతి సినిమాను చూస్తున్నానని.. యానిమల్‌లో ఆమె నటన చాలా బాగుందని ప్రశంసించాడు. అబితాబ్‌ తన నటనను మెచ్చుకోవడం పట్ల రష్మిక ఆనందం వ్యక్తం చేసింది.

>
మరిన్ని వార్తలు