'మర్డర్‌' సెకండ్‌ ట్రైలర్‌ విడుదల

17 Dec, 2020 19:30 IST|Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ నేతృత్వంలోని మర్డర్‌ సినిమా సెకండ్‌ ట్రైలర్‌ విడుదలైంది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సాహితీ ప్రధానపాత్రల్లో నటించిన మర్డర్‌ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్‌, అమృతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.  పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించారు.  ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా  విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. (బిగ్‌బాస్: అరియానాపై ఆర్జీవీ కామెంట్స్‌ )

మాస్టర్‌ మూవీ తెలుగు టీజర్
తమిళ హీరో విజయ్‌ నటించిన మాస్టర్‌ మూవీ తెలుగు టీజర్‌ విడుదలైంది. లోకేష​ కనగరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినమాలో మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే తమిళ వెర్షన్‌లో విడుదలైన మాస్టర్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.   విడుదలైన 16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూట్యూబ్‌లో ఎక్కువ లైక్స్‌ను సొంతం చేసుకున్న టీజర్‌లలో ఒకటిగా అరుదైన రికార్డును సాధించింది.ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా,కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. అయితే  'మాస్టర్'‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు గాను భారీ మొత్తంలోనే నిర్మాతలకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో  విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించారు.  (‘ఆదిపురుష్‌’ దర్శకుడు, విలన్‌పై కోర్టులో పిటిషన్‌ )

మరిన్ని వార్తలు