‘స్కంద’ మాస్ మూవీనే కాదు..ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ ఆకట్టుకుంటాయి: రామ్‌

26 Sep, 2023 10:11 IST|Sakshi

‘బోయపాటి గారి సినిమా అంటే ఫైట్స్ అని అంటారు. ఐతే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. ఆ ఫైట్స్ వెనుక ఎమోషన్. ఆ ఎమోషన్ ని ఎలా బిల్డ్ చేస్తారనేది స్కంద కీ ఎలిమెంట్. స్కంద కేవలం మాస్ సినిమానే కాదు. చాలా అందమైన ఫ్యామిలీ ఎలిమెంట్స్  ఉన్నాయి. ఈ సినిమాకి సోల్ ఫ్యామిలీ ఎమోషన్స్ అని హీరో రామ్‌ పోతినేని అన్నారు. బోయపాటి శ్రీను, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. శ్రీలీల హీరోయిన్‌. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్‌ కరీంనగర్‌లో స్కంద కల్ట్‌ జాతర పేరుతో ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ.. బోయపాటి గారు ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ పెడతారు. ఇందులో మెసేజ్ ని కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. 

‘నేను సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడతాను. ఒక్కసారి ఔట్‌పుట్‌ వచ్చిన తర్వాత ఇంక టెన్షన్ ఉండదు. ఎందుకంటే చాలా బాగా తీశాననే నమ్మకం. స్కంద చాలా మంచి సినిమా. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం కచ్చితంగా అందరూ మనస్పూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు బోయపాటి అన్నారు. రామ్- బోయపాటి సినిమా అభిమానులందరికీ ఒక పండగలా ఉంటుందని హీరో శ్రీకాంత్‌ అన్నారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్‌ సాయి మంజ్రేకర్‌, ఇంద్రజ, ప్రిన్స్‌, శ్రవణ్‌, రచ్చరవితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. 

రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె..
కరీంనగర్‌లో నిర్వహించిన కల్ట్‌ జాతర ఈవెంట్‌లో స్కంద మూవీ రెండో ట్రైలర్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేశారు. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీన్స్‌తో ట్రైలర్‌ అదిరిపోయింది.'నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో చూడను’,'రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె...చూసుకుందాం..బరాబర్ చూసుకుందాం.'' అంటూ ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి. మాస్తో   పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. తమన్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది 

మరిన్ని వార్తలు