రవితేజ లిస్ట్‌లోకి మరో సీక్వెల్‌.. దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో!

31 Jul, 2022 15:32 IST|Sakshi

ఒక స్టోరీని రవితేజను దృష్టిలో పెట్టుకుని రాస్తే ఆ క్యారెక్టర్ తనదైన శైలిలో లైఫ్ ఇస్తాడు మాస్ మహా రాజా. అందుకే ఆ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసేందుకు దర్శకులు ముందుగానే సీక్వెల్ ఐడియా రాసుకుంటారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ శరత్ మండవ కూడా చేరిపోయాడు. రామారావు ఆన్ డ్యూటీకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చాడు. పైగా సీక్వెల్లో మాస్ మహా రాజా ను మరింత పవర్ ఫుల్ కు షిఫ్ట్ చేసాడు.

(చదవండి: రామారావు ఆన్‌ డ్యూటీ మూవీ రివ్యూ)

కాగా, రవితేజ ఇప్పటికే కిక్ సీక్వెల్ కిక్ 2 చేశాడు. అయితే ఈ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అందుకే రవితేజ సీక్వెల్స్ కు కొంత బ్రేక్ ఇచ్చాడు. కాని మాస్ రాజాతో మూవీస్ తీస్తున్న దర్శకులు మాత్రం ఆయన కోసం సీక్వెల్ స్టోరీస్ రెడీ చేసి పెట్టుకున్నారు.  రాజా ది గ్రేట్ సీక్వెల్ స్టోరీతో అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడు. రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విచ్చేసిన సందర్భంలో కూడా రాజా ది గ్రేట్ సీక్వెల్ గురించి మాట్లాడాడు.

గతేడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మాస్ రాజా కమ్ బ్యాక్ మూవీ క్రాక్ కు సీక్వెల్ కు స్టోరీని రాసిపెట్టుకున్నాడు గోపీచంద్ మలినేని. రవితేజ డేట్స్ ఇస్తే మరోసా భూమ్ బద్దలయ్యే బ్లాక్ బస్టర్ అందిస్తానంటున్నాడు. మొత్తంగా మాస్ రాజా చేయాల్సిన సీక్వెల్స్ లిస్ట్ 3కు పెరిగింది. వీటిల్లో ఏ సీక్వెల్ కు రవితేజ ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

మరిన్ని వార్తలు