Randeep Hooda Marriage: నటిని పెళ్లాడనున్న రణ్‌దీప్‌.. అది కూడా డిఫరెంట్ స్టైల్లో!

24 Nov, 2023 18:29 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్‌ హుడా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 2001లో మాన్‌సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్‌టెయిల్, కిక్ (బాలీవుడ్), రసియా, హైవే , సర్బ్‌జిత్ లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా స్వతంత్ర వీర్‌ సావర్కర్‌ మూవీని తానే స్వయంగా తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్న బాలీవుడ్‌ నటుడు లేటు వయసులె పెళ్లి పీటలెక్కనున్నారు. 

తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను రణ్‌దీప్ పెళ్లి చేసుకోనున్నారు. నవంబర్ 29న మణిపూర్‌లో వీరి వివాహం జరగనుంది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే వేడుకకు హాజరు కానున్నారు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు వివాహాబంధంతో ఒక్కటి కాబోతున్నారు.

డిఫరెంట్‌ స్టైల్లో వెడ్డింగ్!

అయితే ఈ రోజుల్లో సెలబ్రిటీల పెళ్లి అంటే గ్రాండ్ డిస్టినేషన్‌ వెడ్డింగ్ ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ వివాహాం ఇటలీలో అలాగే జరిగింది. అయితే ఈ జంట మాత్రం అందరికంటే భిన్నంగా మహాభారతం పౌరాణిక నేపథ్యంతో వివాహాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లిన్ మణిపూర్‌కు చెందిన నటి కాగా.. తనకు కాబోయే భార్య సొంత ఊర్లోనే ఈ వేడుక జరగనుంది. మణిపూర్ సంప్రదాయంలో వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్ ప్లాన్‌ చేశారు. అయితే దీనిపై పెళ్లి తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

సీక్రెట్‌గా డేటింగ్!

వీరిద్దరు డేటింగ్‌పై సోషల్ మీడియాలో చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ రణదీప్, లిన్ తమ రిలేషన్‌ను ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. 2022లో దీపావళి వేడుకల తర్వాత ఈ జంట  తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రణ్‌దీప్ అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో ఇలియానాతో కలిసి నటిస్తున్నారు. ఆ తర్వాత స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు లిన్ చివరిసారిగా కరీనా కపూర్, విజయ్ వర్మ నటించిన జానే జాన్‌లో కనిపించారు. అంతే కాకుండా ఓం శాంతి ఓం, మేరీ కోమ్, మాతృ కి బిజిలీ కా మండోలా, రంగూన్ ఆక్సోన్ వంటి చిత్రాలలో కూడా నటించారు. 

మరిన్ని వార్తలు