ఛలో ఇటలీ

4 Oct, 2020 02:02 IST|Sakshi

నితిన్, కీర్తీ సురేశ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ సినిమాలో కొన్ని పాటలు, కీలక సన్నివేశాలను ఫారిన్‌లో చిత్రీకరించాలనుకున్నారు.

కరోనా వల్ల ఆ షెడ్యూల్‌ను ఇండియాలో చేయాలనుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు ఫారిన్‌లోనే చిత్రీకరణ జరపడానికి చిత్రబృందం రెడీ అయింది. ఇటలీలో మూడువారాల పాటు పాటల్ని, సన్నివేశాలను షూట్‌ చేయనున్నారు. త్వరలోనే ‘రంగ్‌ దే’ టీమ్‌ ఇటలీ ప్రయాణించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు