‘ఫోర్బ్స్’ ప్ర‌భావంత‌మైన న‌టుల జాబితా విడుద‌ల.. అగ్రస్థానం పొందిన‌ ర‌ష్మిక‌

17 Oct, 2021 21:56 IST|Sakshi

ఫోర్బ్స్ భారతదేశంలో ‘అత్యంత ప్రభావవంతమైన నటుల’ జాబితాలో నటి రష్మిక మంద‌న్నా అగ్రస్థానం సంపాదించింది. సమంత, విజయ్ దేవరకొండ, యష్‌, అల్లు అర్జున్ వంటి హేమ‌హేమీల‌ను దాటుకుంటూ టాప్‌కి చేరింది.

బెంగుళూరుకు చెందిన రష్మిక తెలుగు, త‌మిళ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకుంది. త్వ‌ర‌లోనే సిద్ధార్థ్ మ‌ల్హోత్రాకి జోడిగా న‌టిస్తుండ‌డంతో ఉత్త‌రాదిన కూడా పాపులారిటీ సంపాదించింది. దీంతో సౌత్‌లోని మంచి మంచి న‌టుల‌ను దాటుకుంటూ ఈ జాబితాలో అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకుంది.

తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు సోష‌ల్ మీడియాలో పెరిగిన ఫాలోవ‌ర్స్‌, లైక్స్, కామెంట్స్, వ్యూస్ వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ జాబితాని త‌యారు చేశారు. ఇందులో 10 పాయింట్లకు 9.88 సాధించింది ఈ ర‌ష్మిక‌. కాగా 9.67తో విజ‌య్ దేవ‌ర‌కొండ రెండో స్థానం, 9.54తో క‌న్న‌డ హీరో య‌శ్ మూడో స్థానం, 9.49తో సమంత నాలుగో స్థానం, 9.46తో అల్లు అర్జున్ ఐదో స్థానంలో నిలిచారు.

చ‌ద‌వండి: పుష్ప నుంచి శ్రీవల్లి సాంగ్‌ విడుదల

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు