సీక్రెట్‌ గిఫ్ట్‌: తెగ నచ్చిందంటోన్న రష్మిక‌!

29 Mar, 2021 15:44 IST|Sakshi

షీ సో క్యూట్‌.. షీ సో స్వీట్‌, షీ సో బ్యూటిఫుల్‌.. రష్మికను చూస్తే అభిమానులు ఈ పాట పాడకుండా ఉండరు. ఎప్పుడూ తెగ అల్లరి చేస్తూ కనిపించే ఈ భామ ఈ మధ్య చాలా బిజీ అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'పుష్ప', శర్వానంద్‌ 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలతో బిజీగా ఉంది. సిద్దార్థ్‌ మల్హోత్రా 'మిస్టర్‌ మజ్ను'తో బాలీవుడ్‌లోకి, హీరో కార్తీ 'సుల్తాన్‌' చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

హోలీ పండగను పురస్కరించుకుని ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ సీక్రెట్‌గా రష్మిక ఇంటిని చేరిందట. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. "ఈ కానుక ఎవరు పంపారో కానీ, అది నాకు అందింది. ఈ రింగ్‌ నాకు పర్ఫెక్ట్‌గా సెట్టయింది. చాలా నచ్చింది కూడా! పనిలో పనిగా మీరు రాసిన సీక్రెట్‌ మెసేజ్‌ కూడా చదివాను" అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు వేలికి ఉంగరం తొడుక్కున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది.

ఇది చూసిన అభిమానులు ఈ స్పెషల్‌ గిఫ్ట్‌ ఎవరు ఇచ్చుంటారా? అని ఆలోచిస్తున్నారు. ఎవరైనా వీరాభిమాని ఈ కానుకను పంపారా? లేదా రష్మిక సీక్రెట్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఈ ఉంగరాన్ని బహుకరించి ఉంటాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు!

మరిన్ని వార్తలు