Dhamaka Movie Box Office Collection: కలెక్షన్ల మోత మోగిస్తున్న ధమాకా.. మూడు రోజుల్లో ఎంత వచ్చిందంటే?

26 Dec, 2022 16:41 IST|Sakshi

Dhamaka Movie Box Office Collection Day 3: మాస్‌ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ధమాకా. పెళ్లిచూపులు బ్యూటీ శ్రీలీల రవితేజతో జోడీ కట్టింది. బాక్సాఫీస్‌ వద్ద వీరిద్దరి జోడీ కాసుల వర్షం కురిపిస్తోంది. మాస్‌ యాక్షన్‌కు, తీన్మార్‌ స్టెప్పులకు ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు వేస్తున్నారు. 

త్రినాథరావు నక్కిన డైరెక్ట్‌ చేసిన ఈ మూవీని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. గత శుక్రవారం (డిసెంబర్‌ 23న) రిలీజైన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటిరోజే రూ.10 కోట్ల గ్రాస్‌ రాబట్టిన ఈ మూవీ మూడు రోజుల్లో రూ.32 కోట్ల గ్రాస్‌ సొంతం చేసుకుంది. చూస్తుంటే క్రిస్‌మస్‌ సెలవులను ధమాకా బాగానే క్యాష్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

చదవండి: సెన్సేషన్‌గా అవతార్‌ 2, మొత్తం కలెక్షన్స్‌ ఎంతంటే?

మరిన్ని వార్తలు