Ravichandran: క్రేజీ స్టార్‌ రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్‌

12 Apr, 2022 12:44 IST|Sakshi

శివాజీనగర: బెంగళూరు నగర విశ్వవిద్యాలయం ప్రప్రథమంగా స్నాతకోత్సవంలో కన్నడ సినీ నటుడు, క్రేజీ స్టార్‌ వి. రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. సోమవారం సెంట్రల్‌ కాలేజీ ఙ్ఞానజ్యోతి సభా మందిరంలో గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ చేతుల మీదుగా రవిచంద్రన్‌ సహా 30మంది వివిధ రంగాల ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను బహుకరించారు. మంత్రి సీఎన్‌ ఆథ్వథ్‌ నారాయణ మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లుగా సినిమాలో చూపించడం ఆయన కళ అని అన్నారు. 

మరిన్ని వార్తలు