దిలీప్‌ కుమార్‌ కెరీర్‌లో అద్భుతమైన పాట ఇదే

7 Jul, 2021 12:33 IST|Sakshi

దిలీప్‌ కుమార్‌..ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు సంపాదించిన గొప్ప నటుడు . ఆరు దశాబ్దాలకు పైగా సినీ జీవితం ఆయనది. 60పైగా చిత్రాల్లో నటించాడు. వాటిలో ఓ మచ్చుతునక ‘మొగలే ఆజమ్’. ఈ సినిమాలో సలీంగా ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. అప్పటికే ట్రాజెడీ కింగ్ గా పేరుపొందిన దిలీప్ కుమార్.. ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచారు.

ఇక ఈ సినమాలోని ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’పాట ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. బహుశా ఈ పాట వినని సంగీత ప్రియులు ఉండరేమో. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఖ్యాతిని శిఖరాగ్రానికి  చేర్చిన పాట ఇది. సినిమా అంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంటుంది కానీ ఆ పాట మాత్రం కలర్‌లో తీశారు. ఈ పాటకి షకీల్ బదాయునీ లిరిక్స్‌ అందించగా, నౌషాద్ అధ్భుతమైన సంగీతం అందించాడు.

మొగలే ఆజమ్’విషయానికొస్తే.. మొఘల్ సామ్రాజ్యంలో యువరాజ్ సలీం, నర్తకి అనార్కలి ప్రేమ కథతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ఇది. అప్పట్లో భారీ కలెక్షన్లతోపాటు సంచనల విజయం సాధించింది. అక్బ‌ర్ కుమారుడు స‌లీమ్‌ పాత్రలో దిలీప్‌ కుమార్‌ ఒదిగిపోయాడు. యువ‌రాజు స‌లీమ్‌ను వీర‌యోధుడిగా మార్చాల‌నుకున్న అక్బ‌ర్ త‌న కురుమారిడిని యుద్ధ విద్య నేర్చుకునేందుకు చిన్న‌త‌నంలో బ‌య‌ట‌కు పంపిస్తాడు. 14 ఏళ్ల త‌ర్వాత తిరిగి వ‌చ్చిన స‌లీమ్‌కు .. త‌మ స‌భ‌లో ఆస్థాన న‌ర్త‌కి అయిన అనార్క‌లీ ప్రేమ‌లో ప‌డుతాడు. స‌లీమ్-అనార్క‌లీ ప్రేమ‌క‌థ అంద‌రికీ తెలిసిందే. ఈ ఫిల్మ్‌లో భ‌గ్న ప్రేమికుడ‌గా స‌లీమ్ త‌న న‌ట‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని 2004లో పూర్తి స్థాయి రంగుల చిత్రంగా మార్చి విడుదల చేసిన మంచి స్పందన రావడం విశేషం. 41 ఏళ్ల తర్వాత 2006లో పాకిస్థాన్ లో విడుదలైన తొలి హిందీ చిత్రంగా ఘనత కూడా సాధించింది.

మరిన్ని వార్తలు