సమంత కన్నా ముందు.. చై ఆ హీరోయిన్‌తో డేటింగ్‌, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట..!

25 Nov, 2021 15:44 IST|Sakshi

Report Says Before Samantha Naga Chaitanya Wanted to Marry Shruti Haasan: టాలీవుడ్‌ మోస్ట్‌ రోమాటింక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత-నాగ చైతన్యలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికి అందరికి షాక్‌ ఇచ్చారు. విడాకులు ప్రకటన అనంతరం ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయ్యారు. సమంత, చైతన్యలు విడిపోయినప్పటికి.. వీరద్దరికి సంబంధించి నిత్యం ఏదో వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.

తాజాగా నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా సమంత మీద సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ నడిచింది. ముఖ్యంగా చై పుట్టిన రోజు నాడు సమంత అతడికి శుభాకాంక్షలు చెప్పలేదు.. పైగా తన పెంపుడు కుక్కకు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలపడంతో నెటిజన్లు సామ్‌ మీద ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. 
(చదవండి: సమంతపై నెటిజన్ల ఫైర్‌)

ఇదిలా ఉండగా.. తాజాగా నాగచైతన్యకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. సమంత కన్నా ముందు చై.. ఓ స్టార్‌ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. మరీ ఏం జరిగిందో తెలియదు కానీ వారి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదనేది వార్త సారంశం. మరి చై అంత గాఢంగా ప్రేమించిన ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరంటే.. విలక్షణ నటడు కమల్‌హాసన్‌ కుమార్తె శ్రుతి హాసన్‌ అట. 

చై-శ్రుతి హాసన్‌ల రిలేషన్‌ గురించి  KoiMoi.com ప్రచురించింది. ఈ వెబ్‌సైట్‌లో ఉన్నదాని ప్రకారం.. చై, శ్రుతి హాసన్‌లకు 2013లో పరిచయం ఏర్పడింది. ఇక సమంతను పెళ్లి చేసుకోకముందు అనగా.. 2017లో చై, శ్రుతి హాసన్‌తో డేటింగ్‌ చేశాడట. శ్రుతి, చైతన్యల మధ్య సిరీయస్‌ రిలేషన్‌ కొనసాగిందని.. ఒకానొక సమయంలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారట. ఏం జరిగిందో తెలియదరు ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారట. వీరద్దరూ కలిసి 2018లో విడుదలైన ప్రేమమ్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
(చదవండి: బ్రేకప్‌ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతూ..)

ఇక శ్రుతితో బ్రేకప్‌ తర్వాత అదే ఏడాది అనగా.. 2017లో చై-సామ్‌ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగేళ్లకు ఈ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక గతంలో కూడా నాగచైతన్య.. మరో స్టార్‌ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగించాడని.. ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని భావించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

చదవండి: Samantha: పుకార్లే నిజమయ్యాయి.. సమంతకు ఫస్ట్‌ టైమ్‌ ఇది

మరిన్ని వార్తలు