ఆ వార్తలు చదువుతుంటే రక్తం మరుగుతోంది: హీరోయిన్‌

1 Oct, 2023 09:26 IST|Sakshi

తమిళ సినిమా: మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి చదువుతుంటే ఒంట్లో రక్తం మరుగుతోందని నటి రిత్విక సింగ్‌ పేర్కొంది. రియల్‌ బాక్సర్‌ అయిన ఈ ముద్దుగుమ్మ హిందీ, తమిళం భాషల్లో రూపొందిన ఇరుది చుట్రు చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అదే చిత్రం రీమేక్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అదేవిధంగా తమిళంలో ఆండవన్‌ కట్టలై, శివలింగ, ఓమై కడవలే, కొలై తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈమె సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తీవ్రంగా స్పందించింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో  ఇలా రాసుకొచ్చింది. ‘స్త్రీలు, యువతులు, బాలికలను వేధింపులకు గురి చేయడం, అత్యాచారాలకు పాల్పడడం, హత్యలు చేయడం వంటి వార్తలు చదువుతుంటే రక్తం మరుగుతోందని పేర్కొంది. ప్రతి రెండు గంటలకు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే భయం వేస్తోందని తెలిపింది. ఇలాంటివి చాలా మంది ఎదుర్కొంటున్నాని చెప్పింది. మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంది. వ్యాయామం, ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తప్పుగా ప్రవర్తించే వారికి మీరు కొడతారనే భయం కలగాలని.. పిల్లలు చురుగ్గా ఉండడానికి తల్లిదండ్రులు వారికి ఆత్మరక్షణ విద్య నేరి్పంచాలని సూచించారు. మహిళలను ఆట వస్తువులా చూడరాదని మగ మృగాలకు తెలియజేయాలని నటి రిత్విక సింగ్‌ పేర్కొంది.

A post shared by Ritika Singh (@ritika_offl)

మరిన్ని వార్తలు