Romantic Twitter Review: పూరి తనయుడి ‘రొమాంటిక్’ ఎలా ఉందంటే..

29 Oct, 2021 08:41 IST|Sakshi
Romantic Movie Twitter Review

పూరీ జగన్నాథ్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్‌ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. కేతిక శర్మ హీరోయిన్‏గా నటించింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఇక సీనియర్ నటి రమ్యక్రిష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.

ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్‌ ట్రాక్‌ ఎక్కించాలని ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్‌, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్‌’పై హైప్‌ క్రియేట్‌ అయిది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్‌ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 

ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.

మరిన్ని వార్తలు