తెలంగాణ సీఎం అభ్యర్థి బయోపిక్.. టీజర్ రిలీజ్

28 Oct, 2023 16:20 IST|Sakshi

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఓ వైపు అన్ని పార్టీల నాయకులు, ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే టైంలో ఆయా పార్టీలు.. సినిమాలతోనూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే 'కేసీఆర్' సినిమా రానుండగా, ఇప్పుడు మరో పార్టీ తరఫున పోటీలో ఉన్న ముఖ్యమంత్రి అభర్థి బయోపిక్ విడుదలకు సిద్ధమైంది.

(ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!)

నీల మామిడాల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'ప్రవీణ్ ఐపీఎస్'. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబరులో ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి, ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఐపీఎస్ మాజీ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 

తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో.. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎలివేషన్ ఇచ్చేలా డైలాగ్ పెట్టారు. తప్పితే క్యారెక్టర్స్‌ని పెద్దగా చూపించలేదు. అయితే ఈ సినిమాలో నందకిషోర్, రోజా హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దుర్గా దేవ్ నాయుడు దర్శకుడు. నవంబరు చివర్లో ఎన్నికల జరగడానికి ముందే ఈ సినిమా రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)

మరిన్ని వార్తలు