తళుకుమను తార... 

20 Oct, 2023 00:27 IST|Sakshi
ప్రభాకర్‌

‘బాహుబలి’ ప్రభాకర్‌ లీడ్‌ రోల్‌లో పాలిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్‌ జరుపుకుంటోంది. జాన్‌ భూషణ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తళుకు తళుకుమను తార.. కులుకులొలుకు సితార...’ అంటూ సాగే సెకండ్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ని నటుడు సాయి కుమార్‌ రిలీజ్‌ చేశారు.

ఈ పాటను సురేష్‌ గంగుల రచించారు. ‘‘రౌద్ర రూపాయ నమః’’ చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌. ఈ సినిమా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు సాయికుమార్‌  అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రావుల రమేష్‌. ‘‘ప్రభాకర్‌గారి నటన మా చిత్రానికి ఆయువుపట్టు’’ అన్నారు పాలిక్‌. ఈ కార్యక్రమంలో నటుడు రఘు, రచయిత తోటపల్లి సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి కెమెరా: గిరి–వెంకట్‌. 

మరిన్ని వార్తలు