అమ్మ బాబోయ్‌.. సల్మాన్‌ ఖాన్‌కి అన్ని కోట్ల బహుమతులా!

30 Dec, 2021 16:39 IST|Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ డిసెంబర్‌ 27న తన 56వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. పాన్వేల్‌లోని తన ఫాంహౌస్‌లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకకి కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా సల్మాన్‌ ఖాన్‌కి ఖరీదైన బహుహతులు ఇచ్చారు. సల్మాన్‌ మాజీ ప్రేయసీ కత్రినా కైఫ్‌ సుమారు రూ.3 లక్షలు పెట్టి బంగారపు బ్రాస్‌లెట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చింది. సంజయ్‌ దత్‌ సూమారు రూ.8 లక్షలు విలువ చేసే డైమాండ్‌ బ్రాస్‌లెట్‌ను బహుమతిగా అందించారు. అనిల్‌కపూర్‌..  లెదర్‌ జాకెట్‌ (దాదాపు రూ.29లక్షలు), జాక్వెలిన్‌ రూ.12 లక్షలు విలువ చేసే స్పెషల్‌ వాచ్‌ని గిఫ్ట్‌గా అందించిదట. 
(చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్‌ ఖాన్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌..)

అలాగే సల్మాన్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులు కూడా ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చారు. అతని సోదరి అర్పిత  రూ. 15-17 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చింది. అతని సోదరులు, సోహైల్ ఖాన్  , అర్బాజ్ ఖాన్ అతనికి బీఎండబ్ల్యూ కారు (రూ.25 లక్షలు), ఆడీ కారు( రూ.3కోట్లు) ఇచ్చారట. అర్పితా ఖాన్ భర్త మరియు సల్మాన్ బావ మరియు యాంటిమ్ సహనటుడు ఆయుష్ అతనికి రూ. 75,000 విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడు. వీటితో పాటు  సల్మాన్‌ తండ్రి సలీమ్‌ ఖాన్‌ జుహులో రూ.12 కోట్లు విలువ చేసే అపార్ట్‌మెంట్‌ని బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బర్త్‌డేకి ఇన్ని కోట్ల బహుమతులు రావడం పట్ల సల్లూ భాయ్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, నెటిజన్స్‌ మాత్రం ‘అమ్మ బాబోయ్‌.. సల్మాన్‌ ఖాన్‌ బర్త్‌డేకి అన్ని కోట్ల బహుమతులా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు