వెంకటేశ్‌ ఓ హిందీ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా?

9 Dec, 2021 01:48 IST|Sakshi

వెంకటేశ్‌ ఓ హిందీ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా? అంటే బాలీవుడ్‌ వర్గాలు అవునంటున్నాయి. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించనున్న చిత్రంలో వెంకటేశ్‌ ఓ హీరోగా నటించనున్నారట. ఇటీవల ‘అంతిమ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ తాను వెంకటేశ్‌తో కలసి ఓ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాని ఉద్దేశించే సల్మాన్‌ చెప్పి ఉంటారనే ఊహాగానాలు నెలకొన్నాయి.

గతంలో ‘అనారీ’ (1993), ‘తక్‌ధీర్‌వాలా’ (1995) వంటి హిందీ చిత్రాల్లో నటించారు వెంకీ. ఆ తర్వాత బాలీవుడ్‌కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు హిందీ సినిమా ఒప్పుకున్నది నిజమే అయితే దాదాపు 25 ఏళ్ల తర్వాత వెంకీ మళ్లీ బాలీవుడ్‌లో సినిమా చేసినట్లు అవుతుంది. ఇది యాక్షన్‌–కామెడీ మూవీ అని, ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహిస్తారని టాక్‌.  

మరిన్ని వార్తలు