గ‌త 30 ఏళ్ల‌లో ఇంత పెద్ద బ్రేక్ తీసుకోలేదు

25 Sep, 2020 09:06 IST|Sakshi

సాక్షి, ముంబై :  అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్‌14కు అంతా సిద్ధ‌మ‌య్యింది. ఈ సీజ‌న్‌ను కూడా స‌ల్మాన్ ఖాన్ హోస్ట్  చేయ‌నున్నారు.   బిగ్‌బాస్ వ‌ర్చువ‌ల్ లాంచ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స‌ల్మాన్ మాట్లాడుతూ.. గ‌త 30 ఏళ్ల‌లో ఇంత సుధీర్ఘ విరామం ఎప్పుడూ తీసుకోలేద‌ని  తెలిపారు. ''మైనే ప్యార్ కియా' సినిమా చేసినప్ప‌టి నుంచి సాధార‌ణంగా  అయితే ప్ర‌తీ సంవ‌త్స‌రం డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు విరామం తీసుకునేవాడిని. కానీ గ‌త ప‌దేళ్లుగా బిగ్‌బాస్ హోస్ట్‌గా చేస్తున్న‌ప్ప‌టినుంచి ఆ విరామం కూడా తీసుకోకుండా ప‌నిచేస్తున్నాను. సెల‌వు రోజుల్లో కూడా సంతోషంగా ప‌నిచేసేవాడిని. కానీ క‌రోనా కార‌ణంగా అతిపెద్ద బ్రేక్ వ‌చ్చిందని పేర్కొన్నాడు.  దీంతో ఈ పూర్తి స‌మ‌యాన్ని ఫామ్‌హౌస్‌లో  త‌న గుర్రాన్ని జాగ్ర‌త్త‌గా  చూసుకోవ‌డం, కొత్త మెక్క‌లు నాట‌డం వంటివి చేశాను' అని చెప్పుకొచ్చాడు. (అప్ప‌టినుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది..)

బిగ్‌బాస్ హోస్ట్‌గా భారీ మొత్తంలో పారితోషికం అందుకునే స‌ల్మాన్ ఈసారి మాత్రం త‌న రెమ్యున‌రేష‌న్‌లో కోత విధించ‌మ‌ని కోరాడ‌ట‌. దీంతో బిగ్‌బాస్ పార్టిసిపెంట్లు స‌హా సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వొచ్చు అని తెలిపాడు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌ల కోసం  స్పా, రెస్టారెంట్, థియేటర్  షాపింగ్ మాల్ స‌హా అత్యాధునిక వ‌స‌తులు క‌ల్పించారు. గురువారం ప్రారంభ‌మైన సీజ‌న్‌14  తొలి కంటెస్టెంట్‌గా గాయ‌కుడు కుమార్ సాను కుమారుడు జాన్ కుమార్ సానును ప‌రిచ‌యం చేశారు.  ఇక వ‌ర్చువ‌ల్ టూర్ కార్య‌క్ర‌మంలో గ‌త సీజ‌న్ కంటెస్టెంట్లు సిధార్థ్ శుక్లా, గౌహర్ ఖాన్ , హీనా ఖాన్ పాల్గొని త‌మ ఎక్స్‌పీరియ‌న్స్‌ని షేర్ చేసుకున్నారు. అక్టోబ‌ర్ 3(శ‌నివారం) నుంచి క‌ల‌ర్స్ చాన‌ల్‌లో బిగ్‌బాస్ సీజ‌న్ 14 ప్ర‌సారం కానుంది. కంటెస్టెంట్‌ల ఆరోగ్యవిష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నామ‌ని షో యాజ‌మాన్యం తెలిపారు. ప్ర‌తీ ఒక్క‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాకే హౌస్‌లోకి పంపిస్తామ‌ని తెలిపారు. (బిజీ బిజీగా స‌ల్మాన్ ఖాన్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా