'ప్రత్యూష ఫౌండేషన్‌'.. అలా మొదలైంది : సమంత

28 Apr, 2021 09:30 IST|Sakshi

సమంత.. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే సమంత సినీ ఇండస్ర్టీకి రాకముందు పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌ చేసేది. సినిమాల్లోకి రావాలన్న కోరిక లేకపోయినా అవకాశాలే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఓ యాడ్‌ షూట్‌లో సమంతని చూసిన డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ ఏ మాయ చేశావే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత సమంత జీవితం ఒక్కసారిగి మారిపోయింది. తొలి సినిమాతోనే ఎంతోమంది కుర్రాల మనసు మాయ చేసిన సమంత ఈ సినిమాలో తనతో కలిసి నటించిన నాగ చైతన్యని 2017లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కెరీర్‌ తొలినాళ్లలోనే మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టిన సమంత లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ ఇండస్ర్టీలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన సమంత పెళ్లి తర్వాత కూడా సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది.


సమంత పూర్తి పేరు సమంత రూత్‌ ప్రభు అయినా ఆమె ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రం ఆమెను యశోద అని పిలుస్తారట. ఇండస్ర్టీకి వచ్చిన తొలి నాళ్లలో డయాబెటీస్‌తో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న సమంత దాని వల్ల ఓ  ఏడాది పాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ఆ సమంయంలోనే ప్రత్యూష అనే ఫౌండేషన్‌తో ఎంతోమందికి చేయూతనిచ్చింది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సమంత.. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది.

ఈ విషయంలో తనకు తన తల్లే స్పూర్తి అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. తనకున్న దాంట్లో వేరే వాళ్లకు సహాయం చేయగలిగినప్పుడే ఆ డబ్బుకు అర్థం ఉంటుందని ఆ విధంగానే ప్రత్యూష ఫౌండేషన్‌ మొదలు పెట్టినట్లు వెల్లడించింది. ఇక సినిమాలతో పాటు బిజినెస్‌ ఉమెన్‌గానూ సమంత రాణిస్తుంది. మైక్రోగ్రీన్స్‌తో కూరగాయలు పండించడం, చిన్నారుల కోసం ఏకం లర్నింగ్‌ అనే స్కూల్‌ సహా రీసెంట్‌గా బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టింది సమంత. ప్రస్తుతం ఆమె గుణశేఖర్‌ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్‌ ఇండియా మూవీలో నటిస్తోంది. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు