‘శాకుంతలం’ టీంకు గుడ్‌బై చెప్పిన సామ్‌!

13 Aug, 2021 10:11 IST|Sakshi

సమంత అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం శాకుంతలం.  పీరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో పాన్‌ ఇండియా మూవీ చిత్రంగా గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ చిత్రీకరణలో సమంత పాల్గొన్ని సంగతి తెలిసిందే. కాగా తాజాగా సామ్‌ శాకుంతలంలో తన షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సమంత వెల్లడించింది. అయితే సమంత షూటింగ్‌ పూర్తి చేసుకున్న నేపథ్యంలో శాకుంతలం సెట్‌లో మూవీ టీం కేక్‌ కట్‌ చేయించిన ఫొటోలను ఈ సందర్భంగా ఆమె షేర్‌ చేసింది. 

తన పోస్ట్‌లో సమంత.. ‘ఒక చిన్న అమ్మాయిగా నేను అద్భుత కథలను న‌మ్మాను. అవి పెద్ద‌గా మార‌లేదు. నా అద్భుతమైన‌ గాడ్ ఫాదర్ గుణ‌శేఖ‌ర్ సార్ నా కలను నిజం చేసినందుకు సంతోషంగా ఉంది’ అంటూ శాకుంత‌లం ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చింది. ‘గుణశేఖ‌ర్ నాకు క‌థ చెప్పిన‌పుడు.. వెంట‌నే చాలా అంద‌మైన ప్ర‌పంచంలోకి వెళ్లిపోయాను.  శాకుంత‌లం లాంటి ప్ర‌పంచం మ‌రొక‌టి లేదు అనిపించింది. సెల్యూలాయిడ్ మీద అలాంటి అంద‌మైన ప్ర‌పంచాన్ని సృష్టించ‌డం సాధ్య‌మేనా..? అనిపించింది. కానీ గుణ శేఖ‌ర్ సార్ నా అంచ‌నాల‌కు మించిన ప్ర‌పంచాన్ని సృష్టించారంది. షూటింగ్‌లో ఉన్నంత సేపు నాలోని చిన్నపిల్ల ఆనందంతో చిందులేసింది. నేటితో శాకుంతలం టీంకు గుడ్బై చెబుతున్నా. గుణ శేఖ‌ర్ పట్ల ఎప్పటికి కృతజ్ఞతా భావం ఉంటుంది’ అంటూ సామ్‌ రాసుకొచ్చింది. కాగా శాకుంత‌లం చిత్రంలో దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఒకేసారి తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారు. 

A post shared by S (@samantharuthprabhuoffl)

మరిన్ని వార్తలు