ఇంట్రెస్టింగ్‌గా సంపూ క్యాలీఫ్లవర్‌ టైటిల్‌ థీమ్‌ పోస్టర్‌

3 Jul, 2021 16:09 IST|Sakshi

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం క్యాలీఫ్లవర్‌. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గూడురు శ్రీధర్‌ సమర్పణలలో మధుసూదన క్రిమేషన్స్‌, రాధాకృష్ణ టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్‌ రావడమే కాకు సంపూ ఈ మూవీతో మరోసారి అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైన్‌ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్‌ క్యాలీప్లవర్‌ టైటిల్‌ థీమ్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఇంగ్లాండ్‌ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్‌ మ్యాన్‌గా సంపూ కనిపించనున్నాడు.

ఈ టైటిల్‌ థీమ్‌లో సంపూ నగ్నంగా దర్శనంగా ఇచ్చాడు. ఒంటిపై ఒక్క నూలుపోగు లేకుండా నగ్నంంగా ఉన్న సంపూ అడ్డుగా క్యాలీఫ్లవర్‌ పెట్టుకుని ధర్నాకు దిగిన ఈ పోస్టర్‌ చూస్తుంటే సినిమాపై మరింత అసక్తిని పెంచుతోంది. ఈ టైటిల్‌ థీమ్‌కు ‘శీలో రక్షతి రక్షిత:’ అనే ట్యాగ్‌లైన్‌ చూస్తుంటే సంపూ తన శీలాన్ని కాపాడుకోవడానికి ధర్నా చేస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే అతనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియజేసే సన్నివేశమే ఈ సినిమాకు మేజర్‌ హైలెట్‌గా ఉండబోతుంది. ఈ మూవీలో సంపూర్ణేష్‌ సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తుంది. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది. ఇందులో పోసాని కృష్ణమురళి, నాగ మహేశ్‌, గెటప్‌ శ్రీను, రోహిణి, గౌతం రాజు తదితరలు నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు