సందీప్‌ రెడ్డి-రణ్‌బీర్‌ కపూర్‌ చిత్రం వచ్చేది అప్పుడే..

19 Nov, 2021 21:21 IST|Sakshi

Sandeep Reddy Vanga And Ranbir Kapoor Film Release Date Out: 'అర్జున్‌ రెడ్డి' సినిమా డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్‌ రొమాంటిక్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా రాబోతున్న చిత్రం 'యానిమల్‌'. ఈ మూవీ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని మేకర్స్‌ రివీల్‌ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 11, 2023న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే మొదట్లో 2022 దసరా కానుకగా రిలీజ్‌ చేస్తామని దర్శకనిర్మాతలు చెప్పినా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. 

ఈ చిత్రంలో రణ్‌బీర్‌ సరసన పరిణితీ చోప్రా హీరోయిన్‌గా చేస్తున్నారు. బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తుండగా, అనిల్‌ కపూర్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. సిద్ధార్థ్‌ గరిమ డైలాగ్స్‌ రాయగా, హర్షవర్ధన్‌ రామేశ్వర్ సంగీతం అందించారు. టీ సిరీస్ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌  సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ కథ సాగుతుందని సమాచారం. ఈ సమాజంలో హీరో జంతువులా ఎలా మారాడనే ఆసక్తికర అంశాలను చూపించనుందే 'యానిమల్‌' చిత్రం. అర్జున్‌ రెడ్డి రీమేక్‌గా వచ్చిన 'కబీర్‌ సింగ్‌'తో బాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్‌ కొట‍్టారు సందీప్‌ రెడ్డి.  

మరిన్ని వార్తలు