న్యూయార్క్‌లో చికిత్స

27 Aug, 2020 02:46 IST|Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌కు లంగ్‌ కేన్సర్‌ అని తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు సంజయ్‌ దత్‌. త్వరలో న్యూయార్క్‌ వెళ్లటానికి వీసా అప్లయ్‌ చేసుకున్నారాయన. ఐదేళ్ల గడువు ఉండే ఆరోగ్య వీసా కోసం అప్లయ్‌ చేశారట. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత భార్య మాన్యత, చెల్లెలు ప్రియాదత్‌తో కలిసి న్యూయార్క్‌ ప్రయాణం అవుతారని తెలిసింది.

అక్కడి మెమోరియల్‌ సియాన్‌ కేటరింగ్‌ కేన్సర్‌ సెంటర్‌లో చేరనున్నారు సంజయ్‌ దత్‌. 1980–81ల మధ్యకాలంలో సంజయ్‌ దత్‌ తల్లి, ప్రముఖ నటి నర్గిస్‌కి ఆ ఆస్పత్రిలోనే కేన్సర్‌ చికిత్స జరిగింది. కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌కి సంబంధించి ప్రపంచంలోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఇది ఒకటి. మనీషా కొయిరాల, సోనాలి బింద్రేలు కూడా అక్కడే ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. వీళ్లలానే సంజయ్‌ దత్‌ కూడా త్వరగా కేన్సర్‌ను జయించి తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు