ఆస్పత్రి నుంచి సంజయ్ ‌దత్‌ డిశ్చార్జి

10 Aug, 2020 16:01 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ సోమవారం లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఛాతీ, శ్వాస‌కోశ‌ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శ‌నివారం సాయంత్రం ముంబైలోని లీలావ‌తి ఆస్ప‌త్రిలో చేరిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు ఆయ‌నను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం జనరల్‌ వార్డుకు షిఫ్ట్‌ చేసి అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత.. పూర్తిగా కోలుకున్న సంజయ్‌ దత్‌ సంపూర్ణ ఆరోగ్యంతో సోమవారం ఇంటికి చేరుకున్నారు. తాము ఆరాధించే నటుడు కోలుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా శనివారం తనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందని సంజయ్‌ ట్వీట్‌ చేశారు. (ఆస్ప‌త్రిలో చేరిన బాలీవుడ్ న‌టుడు)

ప్ర‌స్తుతం త‌న‌ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందంటూ సంజ‌య్‌ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. ‘నేను బాగానే ఉన్నానని మీ అందరికి తెలియ జేస్తున్నాను. కానీ ప్ర‌స్తుతం వైద్యుల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌‌లో ఉన్నాను. లీలావ‌తి ఆసుప‌త్రిలోని వైద్యులు, న‌ర్సులు, సిబ్బంది స‌హాయ స‌హ‌కారాల వ‌ల్ల రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి చేరుకుంటాను. మీ అభిమానానికి, ఆశీర్వాదాల‌కు ధ‌న్య‌వాదాలు’ అని ట్వీట్ చేశారు. కాగా సంజ‌య్ జూలై 29న త‌న పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న "కేజీఎఫ్ చాప్ట‌ర్ 2" నుంచి అరివీర భయంక‌ర‌ అధీరా లుక్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. (అధీరా ఆగయా.. భయానకంగా సంజు గెటప్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా