ఈద్‌కి సత్యమేవజయతే 2

22 Sep, 2020 06:21 IST|Sakshi
జాన్‌ అబ్రహాం

జాన్‌ అబ్రహాం హీరోగా మిలాప్‌ జావేరి దర్శకత్వంలో 2018లో విడుదలైన చిత్రం ‘సత్యమేవ జయతే’. తాజాగా ఈ చిత్రం సీక్వెల్‌ ‘సత్యమేవ జయతే 2’కు విడుదల తేదీని ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. నాగలి పట్టుకుని సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు జాన్‌ అబ్రçహాం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్‌ కానుకగా మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో జాన్‌కు జోడీగా దివ్య కోస్లా కుమార్‌ కనిపిస్తారు. ‘మొదటి భాగంతో పోలిస్తే ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్స్‌ రెండింతలు ఎక్కువగా ఉంటాయి’ అన్నారు దర్శకుడు మిలాప్‌. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు