29న నటి విజయలక్ష్మి కోర్టులో హాజరుకావాల్సిందే

27 Sep, 2023 06:54 IST|Sakshi

ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి  నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. దీంతో మద్రాస్‌ హైకోర్టు నటి విజయలక్ష్మిని ఈ నెల 29న హాజరుకావాలని ఆదేశించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి విజయలక్ష్మి 2011లో నామ్‌ తమిళర్‌ పార్టీ కోఆర్డినేటర్‌ సీమాన్‌న్‌పై వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

(ఇదీ చదవండి: వరస మార్చిన రైతుబిడ్డ.. రతికని అ‍క్క అనేశాడు!)

సీమాన్‌, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2011లో దాఖలు చేసిన ఫిర్యాదును 2012లో ఉపసంహరించుకోవాలని నటి విజయలక్ష్మి ఇచ్చిన లేఖ ఆధారంగా పోలీసులు కేసును క్లోజ్‌ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కేసు విచారణ చేపట్టి సమన్లు జారీ చేశారు. 12 ఏళ్ల నాటి కేసులో ఫిర్యాదుదారుల తర్వాత రాజకీయ ఉద్దేశంతో కేసును మళ్లీ తెరుస్తున్నందున కేసు దర్యాప్తుపై నిషేధం విధించాలని కోరారు.

ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చినప్పుడు 2011లో నటి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పుడు కేసు ఎందుకు పెండింగ్‌లో ఉంచారో కూడా సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేష్‌ ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. పోలీసు రిపోర్టు దాఖలైంది. అనంతరం సీమాన్‌ కేసు రద్దుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు నటి విజయలక్ష్మిని 29న కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణను వాయిదా వేశారు.

సీమాన్‌ సూపర్‌.. ఆయన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు 
ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష‍్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని  పేర్కొన్నారు. సీమాన్‌ సూపర్‌ అని.. ఆయన పవర్‌ ఫుల్‌ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష‍్మి పేర్కొన్నారు. సీమాన్‌ పవర్‌ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్‌ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు