నిర్మాత సత్యనారాయణ ఇకలేరు

28 Jul, 2020 06:31 IST|Sakshi
కందేపి సత్యనారాయణ

సీనియర్‌ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి కన్నుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘పాండురంగ మహాత్మ్యం’ అనే డబ్బింగ్‌ సినిమా ద్వారా సత్యనారాయణ నిర్మాతగా మారారు.

‘కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయా మోహిని, దొరగారింట్లో దొంగోడు’ వంటి సినిమాలు నిర్మాతగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఆయన పలు సినిమాలు నిర్మించారు. మొత్తం 40 చిత్రాలకుపైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సత్యనారాయణ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు