ఓటీటీలో హిట్‌ అయిన ఆ సినిమా.. ఇక తెలుగు ఛానెల్‌లో..

23 Apr, 2021 20:29 IST|Sakshi

ఒటిటీలో హిట్‌ అయిన సినిమాలు మరోసారి టీవీ చానెల్‌లో ప్రసారం చేయడం అనేది ట్రెండ్‌కు జీ తెలుగు శ్రీకారం చుట్టింది. అదే క్రమంలో ఇప్పటికే ఓటీటీ వేదికగా మంచి పేరు తెచ్చుకున్న షాదీ ముబారక్‌ సినిమాని జీ తెలుగు చానెల్‌ తమ వీక్షకులకు అందిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి ఇంట్లో ఉండే వినోదాన్ని ఆస్వాదించాలనే ఆలోచన ప్రజల్లో కలుగుతున్న నేపధ్యంలో వారిని ఆకట్టుకోవడానికి   సాగర్‌ ర్‌ కే నాయుడు నటించిన ’షాదీ ముబారక్‌’ సినిమాను వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌ గా ఏప్రిల్‌ 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మరియు శిరీషలు నిర్మాతలు కాగా పద్మశ్రీ  దర్శకత్వం వహించాడు.

కధ సంక్షిప్తంగా...
మాధవ్‌ (సాగర్‌ ర్‌ కే నాయుడు) ఆస్ట్రేలియాలో నివసిస్తాడు. అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్‌ అయి, వధువును సెలక్ట్‌ చేసుకునే క్రమంలో హైదరాబాద్‌ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్‌ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్‌ బ్యూరో ఓనర్‌ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దశ్య రఘునాథ్‌) పరిచయం అవుతుంది. తన తల్లికి యాక్సిడెంట్‌ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె మాధవ్‌తో కలిసి పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ  మాధవ్‌ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ మాధవ్‌ ఒక్కటయ్యారా లేదా అనేది షాదీ ముబారక్‌ కధ. 
 

మరిన్ని వార్తలు