మధుర గతమా...

16 Feb, 2023 01:33 IST|Sakshi

శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శకుంతల–దుష్యంతుడి ప్రేమ నేపథ్యంలో రూపొం దిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 14న విడుదల కానుంది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘మధుర గతమా.. కాలాన్నే ఆపక ఆగావే సాగక, అంగుళికమా జాలైనా చూపక చేజారావే వంచికా..’ అంటూ సాగే పా టని బుధవారం విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పా టని అర్మాన్‌ మాలిక్, శ్రేయా ఘోషల్‌ పా డారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, మధుబాల, గౌతమి తదితరులు నటించారు. 

మరిన్ని వార్తలు