కూతురుతో షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్‌ పూజలు

14 Dec, 2023 21:21 IST|Sakshi

బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ఖాన్‌ హీరోగా రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డంకీ'. ఈ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు నానుంది. ఈ ఏడాది రెండు సూపర్ హిట్లతో బాక్సాఫీస్‌ వద్ద షారుక్‌ ఖాన్‌  సంచలనం సృష్టించారు. తాజాగా 'డంకీ'తో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు షారుక్‌ కూడా ప్రమోషన్స్‌లలో బిజీగా ఉన్నారు.

తాజాగా షారుక్‌ ఖాన్‌ తన కూతురు సుహానా ఖాన్​తో కలిసి షిర్డీ సాయి బాబాను దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షారుక్ ఖాన్‌కు ఆలయ ట్రస్ట్‌ అధికారి శివ శంకర్‌ సన్మానం చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో షిర్డీ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న షారుక్‌.. అక్కడి నుంచి కారులో బయల్దేరి సాయి బాబా ఆలయానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లిన షారుక్‌ అక్కడ అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.  

గత రెండు సినిమాలు పఠాన్‌,జవాన్‌ విడుదలకు ముందు కూడా ఇలా పలు ఆలయాలను షారుక్‌ ఖాన్‌ దర్శించుకుని తన సనిమా మంచి విజయం సాధించాలని పూజలు జరిపారు. ఈ క్రమంలో డిసెంబర్‌ 21న విడుదల కానున్న తన చిత్రం డంకీ కూడా సూపర్‌ హిట్‌ కొట్టాలని ఆయన కోరుకుంటున్నారు. డిసెంబర్‌ 22న ప్రభాస్‌ సలార్‌ కూడా విడుదల కానుంది.

>
మరిన్ని వార్తలు