Sharwanand: అమ్మ బంగారం అమ్మి ఆ సినిమా తీశా, అప్పులపాలయ్యా

7 Sep, 2022 20:11 IST|Sakshi

ప్రముఖ హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీకార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా అక్కినేని అమల, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్‌ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు శర్వానంద్‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా ఆడుతుందనుకున్నాం. అది ఫ్లాప్‌ అయినప్పుడు షాక్‌లోకి వెళ్లిపోయాను. రెండు, మూడు నెలలపాటు నా రూమ్‌లో నుంచి కూడా బయటకు రాలేదు. మా అమ్మ బంగారం తీసుకుని మరీ కో అంటే కోటి సినిమా తీశాం. ఆ సినిమాకు నేనే నిర్మాతను. డబ్బులు పోయాయి. రిలేషన్స్‌ దూరమయ్యాయి. తట్టుకోలేకపోయాను. ఆ అప్పులు తీర్చేందుకు ఆరేళ్లు పట్టింది. అన్ని సంవత్సరాలపాటు ఒక్క షర్ట్‌ కూడా కొనలేదు. రన్‌రాజా రన్‌ సినిమా హిట్టయినప్పుడు ప్రభాస్‌ అన్న పిలిచి ఇంట్లో పార్టీ ఇచ్చాడు. నాకేమో నిజంగా హిట్‌ కొట్టామా? అని డౌట్‌లో ఉన్నాను. ఎక్స్‌ప్రెస్‌ రాజా హిట్టయినప్పుడు కూడా పార్టీకి పిలిచారు. కానీ నేను సోమవారం దాకా నమ్మనని చెప్పాను. అలా సినిమాల సక్సెస్‌ కూడా ఎంజాయ్‌ చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చాడు శర్వానంద్‌.

చదవండి: బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు అడ్డు చెప్పారు
ఒకే ఒక జీవితం చూసి నాగార్జున భావోద్వేగం

మరిన్ని వార్తలు