యాహూ.... ముగించేశాం

10 Jul, 2021 00:20 IST|Sakshi
శర్వానంద్, సిద్ధార్థ్‌

ఫొటో చూశారుగా... శర్వానంద్, సిద్ధార్థ్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ జోరుకి కారణం ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన ‘మహా సముద్రం’ సినిమా పూర్తి కావడమే. ఈ సందర్భంగా శర్వానంద్, సిద్ధార్థ్‌ ‘యాహూ.. ముగించేశాం’ అనేలా నవ్వుతూ ఉన్న పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. సుంకర రామబ్రహ్మం నిర్మాత.

చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ– ‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహా సముద్రం’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ఇంతకంటే సంతోషమైనది మరేదీ లేదు.. థియేటర్లలో కలుద్దాం’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో అన్ని అడ్డంకులను అధిగమించి బెస్ట్‌ ఔట్‌పుట్‌ ఇచ్చిన అజయ్‌ భూపతి, శర్వానంద్, సిద్ధార్థ్, అదితి, అనూ ఇమ్మాన్యుయేల్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు అనిల్‌ సుంకర. ఈ చిత్రానికి సహ నిర్మాత: అజయ్‌ సుంకర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు