థ్రిల్‌ చేస్తారు

2 Oct, 2020 02:31 IST|Sakshi

ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేయడానికి రెడీ అవుతున్నారట రానా, శ్రుతీహాసన్‌. ఈ ఇద్దరూ ఓ వెబ్‌ సిరీస్‌లో కలసి నటించబోతున్నారని టాక్‌. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించబోయే భారీ వెబ్‌ సిరీస్‌లో జంటగా నటిస్తారట రానా, శుత్రి. పది ఎపిసోడ్ల ఈ సిరీస్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఉంటుందట. అయితే ఈ సిరీస్‌ను ఎవరు డైరెక్ట్‌ చేస్తారనేది తెలియాల్సి ఉంది. స్క్రిప్ట్‌ పనులన్నీ పూర్తయ్యాయని తెలిసింది. తెలుగు భాషలో చిత్రీకరించినప్పటికీ ఈ సిరీస్‌ను మిగతా ప్రాంతీయ భాషలన్నింటిలోకి అనువదించనున్నారని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు