యాక్షన్‌ ట్రైలర్‌ రెడీ

3 Dec, 2023 23:44 IST|Sakshi

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ చిత్రం నుంచి మరో ట్రైలర్‌ రిలీజ్‌ కానుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సలార్‌’. ఈ సినిమాలోని తొలిపార్టు ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ నెల 1న ‘సలార్‌:సీజ్‌ఫైర్‌’ చిత్రం తొలి ట్రైలర్‌ విడుదలైంది.

ఇద్దరు మిత్రుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. అయితే ‘సలార్‌:సీజ్‌ఫైర్‌’ నుంచి రెండో ట్రైలర్‌ కూడా రానుందని టాక్‌. సినిమా రిలీజ్‌కు ఐదారు రోజుల ముందు రాబోయే ఈ రిలీజ్‌ ట్రైలర్‌ ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌గా, ప్రభాస్‌ పాత్రను హైలెట్‌ చేసేలా ఉంటుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా, పృథ్వీరాజ్‌ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను విజయ్‌ కిరగందూర్‌ నిర్మించారు.

మరిన్ని వార్తలు