చిరంజీవి సినిమాలో ప్రజా గాయకుడు గద్దర్‌!

29 Aug, 2021 15:06 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’చేస్తున్న చిరు.. ఆ తర్వాత మోహన్‌ రాజా దర్శకత్వంలో గాడ్‌ ఫాదర్‌లో నటించబోతున్నాడు. మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ఇది. ఇందులో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(చదవండి: ఒక్క ట్వీట్‌తో రూమర్స్‌కు చెక్‌ పెట్టిన సమంత!)

ఈ మేరకు దర్శక, నిర్మాతలు గద్దర్‌ని సంప్రదించారని, పాత్ర నచ్చడంతో ఆయన ఈ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  రాబోయే షెడ్యూల్‌లో గద్దర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేయనున్నారని సమాచారం. వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో గద్దర్‌ పాల్గొననున్నారట. ఆయనతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీనటులను ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుసోస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు