హృదయం ముక్కలైంది.. సోనూసూద్‌ ఎమోషనల్‌

8 May, 2021 15:29 IST|Sakshi

సోనూసూద్‌.. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి అండగా నిలుస్తున్న మహానుభావుడు. నిస్వార్థంగా పేదవారి కోసం తన శక్తినంతధారపోసి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నాడు..  తాజాగా ఈ నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన భారతి అనే కరోనా సోకిన విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా ఆమె ఊపిరితిత్తులు 80-నుంచి 90 శాతం వరకు పాడయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ బాధితురాలిని చికిత్స నిమిత్తం నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దృరదృష్టవశాత్తు ఆమె తుదిశ్వాస విడిచింది. ప్రాణాలు కోల్పోవడంతో సోనూసూద్‌ కంటతడి పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేదనకు లోనైన సోనూసూద్‌ ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. 

@కరోనాతో బాధపడుతున్న భారతి అనే యువతిని ఇటీవల నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లో తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అయితే చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచింది. నెల రోజులపాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. నేను ఆమెను బతికించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నా హృదయం ముక్కలైంది’ అని ఉద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: Sonu Sood: ప్రాణం పోసిన సోనూసూద్‌ ట్రస్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు