అజయ్‌ దేవగణ్‌, సుదీప్‌ల ట్విటర్‌ వార్‌పై సోనూసూద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

29 Apr, 2022 00:34 IST|Sakshi

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌, బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ల మధ్య  నెలకొన్న ట్విటర్‌ వార్‌ గురించి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా నటుడు సోనూసూద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్‌ ఏమన్నాడంటే 'భారతదేశం అంతటా ఒకే భాష ఉంది. అదే ఎంటర్‌టైన్‌మెంట్‌. నువ్వు ఏ చిత్ర పరిశ్రమ నుంచి అనేది ఇక్కడ అనవసరం. కానీ నువ్వు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచగలిగితే చాలు వారు నిన్ను ఆదరిస్తారు' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక అదే విధంగా దక్షిణాది చిత్రాల ప్రభావం మాత్రం భవిష్యత్తు హిందీ సినిమాలపై ఉంటుందన్నాడు. అలానే 'ప్రేక్షకుడి అభిరుచుల్లో కూడా కొంత మార్పు వచ్చింది. వారు ప్రతి సినిమాలోనూ కంటెంట్‌ను కోరుకుంటున్నారు. ఓ యావరేజ్‌ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు తమ వేల రూపాయలను ఖర్చు చేయాలని అనుకోవడం లేదు' అంటూ సోనూసూద్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

>
మరిన్ని వార్తలు