సిద్దిపేటలో ‘సోనూసూద్‌’ ఆక్సిజన్‌ ప్లాంట్‌

28 May, 2021 09:21 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ప్రముఖ నటుడు సోనూసూద్‌ నిర్ణయించారు. దీన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతి కావాలంటూ గురువారం నాడు సోనూసూద్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు గుండెగాని రంజిత్, ఆలేటి యాదగిరి మంత్రి హరీశ్‌రావును కలిశారు. ఈ ప్రతిపాదనకు హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు.

చదవండి: వాళ్లు నాకు ఎప్పటికీ ఫోన్‌ చేయరు: సోనూసూద్‌ భావోద్వేగం

పాన్‌ ఇండియా ప్రాజెక్టు : సోనూసూద్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..

మరిన్ని వార్తలు