కన్నీటిపర్యంతమైన నటుడు అలీ

25 Sep, 2020 17:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై సినీనటుడు అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అలీ కన్నీటిపర్యంతమయ్యారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. ఎస్పీబీ మరణం నన్ను ఎంతగానో కుంగదీసింది. కుటుంబ పెద్దను కోల్పోయా. ఆయన‌ లేని‌ లోటు పూడ్చలేనిది. బాలు ఎందరికో స్పూర్తిగా నిలిచారు. ఎన్నో భాషల్లో వేలకొద్ది పాటలు పడే అవకాశం ఎస్పీబీకే దక్కింది. నేను బాబాయ్ అని పిలిచేవాడిని. నన్ను కన్నకొడుకులా ఆదరించారు. చరణ్‌తో సమానంగా నన్ను చూసుకునేవారు. బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని పేర్కొన్నారు.

కాగా, అనారోగ్యానికి గురైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలోని తమరాయిపక్కంలోని బాలు ఫామ్‌హౌజ్‌లో ఆయన అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. బాలు అంత్యక్రియలను తమిళనాడు సర్కార్‌ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనుంది.
(చదవండి: బాలు నటించిన సినిమాలు)

మరిన్ని వార్తలు